Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

10 వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

9 ఫ్లైయింగ్ స్క్వాడ్ ల నియామకం
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విశాలాంధ్ర -విజయనగరం:
ఏప్రిల్ నెల 3 నుండి 18 వ తేదీ వరకు జరగనున్న 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కల్లెకర్ సూర్య కుమారి ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత దికరులతో కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 25 మండలాల్లో 127 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 24,099 మంది రెగ్యులర్ అభ్యర్ధులు, 1,428 ప్రైవేటు అభ్యర్ధులు మొత్తం 25,527 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 నుండి 12.30 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతునన్నారు. పరీక్షల కేంద్రాలను తఃసిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు తనిఖీ చేసి ప్రతి రోజు జిల్లా కల్లెకర్ కు నివేదికలు అందజేయలన్నారు. ప్రతి కేంద్రం వద్దా 144 సెక్షన్ అమలు జరిగేలా తహసిల్దార్లు చూడాలన్నారు. 9 ఫ్లైయింగ్ స్క్వాడ్లను తఃసిల్దార్ల ఆధ్వర్యం లో వేస్తున్నట్లు త్లిపారు. ప్రశ్నా పత్రాల కష్టోడియన్ గా జిల్లా రెవిన్యూ అధ్దికారి వ్యవహరిస్తారని తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా జరగవలసిన బందోబస్త్ ఏర్పాట్లను పటిష్టంగా ఉండేలా చూడాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అలెర్ట్ గా ఉండాలని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి అయ్యేవరకు స్ట్రాంగ్ రూమ్ అయిన కోట హై స్కూల్ వద్ద పోలీస్ బందోబస్త్ ఉండాలన్నారు. ప్రతి కేంద్రం వద్దా తాగు నీటి సరఫరా ఉండాలని, వైద్య శాఖ వారు ప్రధమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు. ఆర్.టి.సి వారు పరీక్షా సమయాలలో అభ్యర్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామం నుండి ప్రత్యెక బస్సు లను నడపాలని సూచించారు.
ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర రెడ్డి , డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి, డి.ఎస్.పి శేషాద్రి , పరీక్షల అసిస్టెంట్ కమీషనర్ లక్ష్మి కుమారి, విద్యుత్ శాఖ ఎస్.ఈ., డిప్యూటీ డి.ఈ.ఓ లు ఆర్.టి.సి ఆర్.ఎం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img