Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం/గరుగుబిల్లి : గరుగుబిల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 18వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని ఆయన వివరించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్.టి.సిలో ఉచిత ప్రయాణం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని రూట్ లలో ఆర్.టి.సి బస్సులను విధిగా నడపాలని ప్రజా రవాణా అధికారిని ఆదేశించామన్నరు. జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని, 210 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన చెప్పారు. 5,272 మంది బాలురు, 5,442 మంది బాలికలు రెగ్యులర్ విద్యార్థులుగాను, 70 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి 10,784 మంది విద్యార్థులు జిల్లాలో పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు. ఏపి ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలకు 6 కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 751 మంది పదోతరగతి, 479 మంది ఇంటర్ పరీక్షలు రాస్తారని ఆయన చెప్పారు. 650 మంది ఇన్విజిలేటర్లను, 12 మంది రూట్ అధికారులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించామని వివరించారు. పరీక్షా కేంద్రాలకు కిలో మీటర్ దూరం పరిధిలో జెరాక్స్ దుకాణాలు మూసి వేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్యశిబిరాలను ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img