Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

కుమరాం హైస్కూలు ప్రతిష్టను పెంచిన ఉపాధ్యాయుల బృందం

*జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి

విశాలాంధ్ర- జామి: విజయనగరం జిల్లా జామి మండలం కుమరాం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రతిష్టను రాష్ట్రంలో నే ఉన్నత స్థాయి కి తీసుకువెళ్లేందుకు ఉపాధ్యాయుల బృందం తీవ్రంగా కృషి చేసి అద్భుత ఫలితాలు సాధించిందని జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,2023,24 సంవత్సరం లో పదవ తరగతి పాసైన హైస్కూల్ విద్యార్థులకు 17 మందికి రాష్ట్రంలో ని మూడు ట్రిపుల్ ఐటీల్లో (నూజువీడు,శ్రీకాకుళం, ఒంగోలు) అవకాశం వచ్చిన సందర్భంగా హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సీహెచ్. పద్మావతి ని మంగళవారం వేదిక ప్రతినిధులతో కలసి సత్కరించారు ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ ఇదే కుమరాం హైస్కూల్ విద్యార్థులు 2023,24 సంవత్సరం కి సంబంధించి ఎన్.ఎమ్.ఎమ్.ఎస్.పరీక్ష లో(జాతీయ విద్యా ఉపకార వేతనం)కు పది మంది ఎంపిక కావడం అభినందనీయమని,విజయనగరం జిల్లాలో కుమరాం హైస్కూలు కి ఒక ప్రత్యేకత ఉందని,2020 నుండి 2024 వరకూ పదవతరగతిలో అద్భుత ఫలితాలు సాధించారని,ఈ సంవత్సరం ఫలితాల్లో 550 పై గా మార్కులు సాధించినవారు 37 మంది ఉంటే,500 మార్కులు సాధించినవారు 87 మంది విద్యార్థులు ఉండటం ప్రధమ శ్రేణిలో 144 మంది పాసవడం విశేషమని అన్నారు,700 వందల మంది విద్యార్థుల జీవితాలు మెరుగు కోసం ఉపాధ్యాయులు నిరంతరం పడుతున్న తపనను పౌర సమాజం, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుర్తించి మరిన్ని మౌలిక సదుపాయాలు హైస్కూల్ కి అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రొంగలి పోతన్న,పౌర వేదిక కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img