Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

వినాయక చవితి వేడుకలపై ప్రత్యేకదృష్టి

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని 35గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న వినాయక చవితిపండుగ వేడుకలపై పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు.మండలంలోని 91విగ్రహాలకు సంబందించి ఆయాగ్రామాల కమిటీ సభ్యులు పోలీస్ అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. తప్పనిసరిగా పోలీస్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సచివాలయం పరిదిలో ఎంఎస్పిలు కూడా వీటిపై దృష్టి పెట్టారని తెలిపారు. అశ్లీల నృత్యం, డిజే వంటి వాటిని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img