Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఆసరా నిధులు రూ.94.18 కోట్లు జమ

విశాలాంధ్ర,పార్వతీపురం : వై.ఎస్.ఆర్.ఆసరా పథకం క్రింద మూడవ విడతగా జిల్లాలో 16,646 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,83,077 మంది సభ్యులకు రూ.94.18 కోట్లు ఆసరా నిధులు జమఅయ్యాయని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగిన వై.ఎస్.ఆర్.ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన సభ్యులు అలజంగి జోగారావులతో పాటు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,మహిళలు పాల్గొన్నారు. జిల్లాలో 16,646 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,83,077 మంది సభ్యులకు మూడవ విడత రూ.94.18 కోట్లు ఆసరా నిధులు జమ అయ్యాయి. మొదటి విడతలో 16,534 సంఘాలకు చెందిన 1,86,192 మంది సభ్యులకు రూ.93.52 కోట్లు, రెండవ విడతలో 16,646 సంఘాలకు చెందిన 1,88,069 మంది సభ్యులకు రూ.94.32 కోట్లు జమ అయ్యాయి. మూడు విడతల్లో రూ.314.92 కోట్లు జమఅయ్యాయి.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మూడవ విడత ఆసరా కార్యక్రమంలో కురుపాం నియోజక వర్గంలో 4127 సంఘాలకు చెందిన మహిళకు రూ.21.02 కోట్లు, పాలకొండ నియోజక వర్గంలో 4506 సంఘాలకు చెందిన మహిళకు రూ.30.07 కోట్లు, పార్వతీపురం నియోజక వర్గంలో 4428 సంఘాలకు చెందిన మహిళకు రూ.26.45 కోట్లు, సాలూరు నియోజక వర్గంలో 3585 సంఘాలకు చెందిన మహిళకు రూ.16.64 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.
శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ మహిళా అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేపడుతున్నారని అన్నారు. పేదల కలలు సాకారం చేయాలని ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు.ఈసందర్భంగా నమూనా చెక్కులను పంపిణీ,ఆసరా పోస్టర్లను విడుదల చేసారు.ఈకార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మజ్జి శోభారాణి, జడ్పిటిసి బలగ రేవతమ్మ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img