ఏ ఎస్ఐ లంక శ్రీనివాసరావు
విశాలాంధ్ర,సీతానగరం: గృహహింస నేరమని, దానిపై చట్టాలో ఉండే సారాంశాన్ని ఏ ఎస్ఐ లంక శ్రీనివాసరావు, పోలీసులు సుజాత, సంపత్ లు తెలిపారు.గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళా వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో గ్రామస్థాయి స్టేట్ హోల్డర్స్ ట్రైనింగు నిర్వహించారు. వారు పలు అంశాలపై మాట్లాడారు.పిల్లలఅక్రమ రవాణా నిర్మూలన, గృహహింస నిర్మూలన, బాల్య వివాహాలు నిర్మూలన,బాల కార్మికుల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి గోడ పత్రికలను విడుదల చేశారు.
గ్రామస్థాయిలో కొంతమందిని ఎంపిక చేసి వారిని రక్ష మరియు కమ్యూనిటీ లీడర్ అని చెప్పి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి నేడు ఇస్తున్న శిక్షనని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ గూర్చి వివరించారు. ప్రతీ ఒక్కరూ దీన్ని డౌన్ లోడ్ చేసుకొని ఆపదసమయంలో దీని వల్ల రక్షణ పొందాలని కోరారు