Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఓటర్ల జాబితా పరిశీలనలో బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు పాల్గొనాలి

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలో పలు పంచాయతీలో శుక్రవారం నుండి ప్రారంభ మైన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో బిఎల్ఓలతో పాటు వైఎస్సార్సీపీ పార్టీకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొని పరిశీలన చేయాలని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు తెలిపారు. పలు గ్రామాల్లో తాము కూడా పాల్గొని ఆయా గ్రామాల బిఎల్ఏలకు తగు సూచనలు, సలహాలను ఇస్తున్నట్లు చెప్పారు. పార్టీఅదేశాలు, ఎమ్మెల్యే జోగారావు ఆదేశాలు మేరకు ఈకార్యక్రమానికి అత్యంత ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.భారత ఎన్నికల సంఘం బూత్ లెవల్ ఏజెంట్లను అనుమతించిందని ఆయన చెప్పారు. డూప్లికేట్ ఎంట్రీలు, చనిపోయిన ఓటర్లు,  శాశ్వతంగా వలస వెళ్ళిన ఓటర్ల వివరాలు పరిశీలన, ఓటర్ల జాబితాలో సవరణలు ఉంటే వాటిని గుర్తించడంలో బిఎల్ఏ లు కీలకపాత్రపోషించాలన్నారు.చిరునామాను మార్చుకున్న ఓటర్ల వివరాలు, డోర్ నంబర్ అడ్రస్ వెరిఫికేషన్ ఓటర్లు వివరాలు పరిశీలన చేసి బి ఎల్ ఓ లకు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. ఓటర్ల వివరాలు అందజేతలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img