విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : గాయత్రి హాస్పిటల్ లో సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సహకారంతో శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ అధినేత పోట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఎం జై చంద్ర నాయుడు, గాయత్రి హాస్పిటల్ ఎండి డాక్టర్ జిబి వెంకట్, పాల్గొని రక్తదాతలను అభినందించారు, రక్తదాన శిబిరాల నిర్వహిస్తున్న పొట్ట శ్రీనివాసరావు ని అభినందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి ఎం రాము వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం 48 మంది రక్తదానం చేశారు.