విశాలాంధ్ర, సీతానగరం:కేంద్ర, రాష్ట్ర సంపదలు అధానీ, అంబానీ వంటి కార్పోరేట్లకే తాకట్టు పెట్టడంవల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారితో పాటు ఎస్సీ ఎస్టీలు ఎలా అభివృధ్ది చెందుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ , వి. వెంకటేశ్వరులు, కె.సురేంద్ర, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, రాష్ట్ర కమిటి సభ్యులు ఏ. అశోక్ లు ప్రశ్నించారు. మంగళవారం అసమానతలు లేని అభివృధ్ది కోసం సీపీఎం ప్రజారక్షణ భేరి రాష్ట్ర బస్సుయాత్ర పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలానికి చేరుకోగా వారికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు.మండలంలోని చినభోగిలి గ్రామంలోజరిగిన బహిరంగసభలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. మోడీ, అమిత్ షా విధానాలతో అంతా ప్రైవేట్ పరం అవ్వడంతో ఉన్నపరిశ్రమలుపోయి, కొత్త పరిశ్రమలులేక నిరుద్యోగం, పేదరికం పెరుగుతుందన్నారు.ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలను మూసివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో చక్కెర కర్మాగారాలు మూతపడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.మండలంలోని వంతెనలు పనులు పూర్తి కాలేదని,సీతానగరం, పెదంకలం, వెంగలరాయసాగర్ వంటి సాగునీరు ప్రాజెక్టులు నిధులులేక రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. రైతుల పంటలు నిల్వలకోసం గిడ్డంగులు లేవన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్ల వల్ల కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి రైతులని ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కొత్త జిల్లాలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని, ఉన్నత చదువులు కోసం ఒక విద్యాసంస్థ లేదన్నారు. జిల్లాలో సాగునీతి ప్రాజెక్టులుకోసం గత తొమ్మిదేళ్లలో ఒక్కపైసా కేటాయింపు జరగలేదన్నారు. దీంతో జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల వల్ల అనుకున్న స్థాయిలో సాగునీరు అందించే సామర్థ్యం లేదన్నారు. అన్నిరంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపల్యాలను వివరించి రైతులు, ప్రజలు గమనించి రానున్న ఎన్నికలలో తగుబుద్ది చెప్పాలని కోరారు. ఈనెల15న విజయవాడలో జరగబోవు బహిరంగ సభకు పెద్దఎత్తున జనాలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు ఎం.సూర్యనారాయణ, డి.సుబ్బారావు, హైమవతితో పాటు మన్యం జిల్లాకు చెందిన వివిధ సంఘాల నాయకులు రెడ్డి వేణు,ఇందిరా, గంట జ్యోతి,రెడ్డి లక్షుమునాయుడు, ఈశ్వరరావు,రమణమూర్తి, నారాయణ స్వామి,గవరవెంకట రమణ, బిఅప్పారావు,కృష్ణ, చిట్టి సూర్యనారాయణ, శాంతకుమారి, వి.రామలక్ష్మి, రెడ్డిలక్ష్మి, గౌరు తదితరులు పాల్గొన్నారు.