Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, September 27, 2024
Friday, September 27, 2024

క్లాప్ వెహికల్ డ్రైవర్లుకు పెంచిన జీతాలు ఇవ్వాలని భిక్షాటన

కార్మికులతో అధికారులు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు

జీతాలు పెంచమంటే మాకు సంబంధం లేదంటున్నారు
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏ.పి. స్వచాంద్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్. రంగరాజు అధ్యక్షతన శుక్రవారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం దగ్గర గత మూడు రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర నుంచి గంటస్థంభం మీదుగా వెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్యాలయం వరకు ప్రతీ దుకాణం దగ్గరకి వెళ్ళి భిక్షాటన చేయడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు క్లాప్ డ్రైవర్లతో గోడ్డు చాకిరీ చేయించుకోవడంలో సంబంధం ఉన్నప్పుడు డ్రైవర్లుకి జీతాలు పెంచి ఇప్పించమని, పి. ఎఫ్ డబ్బులు జమ చేయాలని, ఇ.ఎస్.ఐ కార్డులు ఇప్పించాలని అడిగితే మాకు సంబంధం లేదనడం చాలా బాధాకరం అని అన్నారు. ప్రభుత్వం జి.ఓ ప్రకారం 18,500 ఇస్తున్న సొమ్ముని మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగేస్తూ 10,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఎఐటియుసి పోరాట ఫలితంగా డ్రైవర్లకి 18,500 కనీస వేతనాల జీఓ 7 ను సాధించుకుంటే ఆ విషయం పై నోరుమెదపడం లేదేందుకని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పనులు చేస్తున్న డ్రైవర్ల శ్రమని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జీతానికి తగినట్టుగా పి.ఎఫ్ చెల్లింపులు జరగడం లేదన్నారు. అందులో జరుగుతున్న అవకతవకలను తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని సరిచేయకపోతే పి.ఎఫ్ చెల్లింపుల్లో పెద్ద దోపిడీ జరుగుతుందని తెలిపారు. డ్రైవర్లకి ప్రమాదం జరిగిన, ఏదయినా రోగం వచ్చిన వైద్యం చేయించుకోడానికి ఈఎస్ఐ అమలులో ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదన్నారు. వారానికి ఒక్క రోజు కూడా శెలవు లేకుండా శ్రమిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డ్రైవర్లు మాకు న్యాయం చేయండి అని అడిగేవారి పై కనీసం మానవత్వం లేకుండా విచక్షణారహితంగా ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌళికావసరాలైన వారంతపు సెలవులు, 8 జాతీయ మరియు 15 పండుగ సెలవులు, సంపాదిత సెలవులు, పనిగంటలు మొదలైన వాటికి నోచుకోలేదని అన్నారు. ఇస్తున్న వేతనాల్లో కోతలు విధించడం. ప్రతి నెలా సక్రమంగా జీతాలు వేయకపోవడం దారుణమన్నారు. ప్రతి నెల 5 వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేసి మున్సిపల్ కార్మికుల వలె అప్కాస్ ద్వారా జీతాలు చెల్లించాలని మొదలైన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి శాంతియుత ఉద్యమం మొదలు పెట్టాము ఈ నెల 30 నుంచి సమ్మె పోరాటంలోకి వెళ్లనున్నమని తెలిపారు. ఉధృతం కాకముందే అధికారులు కలుగజే సుకుని సమస్యలు పరిష్కరించి సామరస్య వాతావరణం కల్పించకపోతే తరువాత జరగబోయే పరిణామాలకు అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు లతో పాటు విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో 60 సచివాలయ పరిధిలో పని చేస్తున్న క్లాప్ వెహికల్ డ్రైవర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img