స్పందన కు 244 దరఖాస్తులు
జగనన్నకు చెబుదాం వినతుల పరిష్కార విజయగాధలను తయారు చేయాలి
విజయనగరం – సెప్టెంబరు 25 : జగనన్నకు చెబుదాంలో ఆయా ప్రభుత్వ శాఖలకు వచ్చిన వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా, అర్జీ దారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. వినతులు స్వీకరించినప్పటి నుంచి కింది స్థాయి సిబ్బంది ఆయా వినతులను ఏవిధంగా పరిష్కరిస్తున్నారు, ఆయా అర్జీదారుల కోరిన విధంగా అర్జీ పరిష్కారం అవుతున్నదీ లేనిదీ పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మండల ప్రత్యేకాధికారులు తమ పరిధిలో వచ్చిన వినతుల పరిష్కారంపై నివేదికలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీ ఓపెన్ అయిన కేస్ లను కూడా నిర్దేశిక్త గడువులోగా పరిషారం అయ్యేలా చూడాలన్నారు. లాగిన్ లో ఇంకా చూడవలసిన వాటి సంఖ్య తగ్గాలని, ప్రతి రోజు అధికారులు స్పందన లాగిన్ లో చూడాలని ఆదేశించారు. పరిష్కారం అయిన వినతుల నుండి సంతృప్తి నివేదిక తీసుకోవడం తో పాటు అర్జీ దారు ఇంటికి వెళ్లి ఈ కే వై సి కూడా చేయాలని తెలిపారు. వచ్చే సోమవారానికి పరిష్కారం అయిన వినతుల విజయ గాధలను తయారు చేసి ప్రెజెంటేషన్ ఇవ్వాలని అన్నారు.
సోమవారం జగనన్నకు చెపుదాం కార్యక్రమం లో వినతులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్‌లు పద్మలత, సూర్యనారాయణ, సుదర్శన దొర తదితరులు స్వీకరించారు. ఈ వారం అత్యధికంగా 244 వినతులు అందాయి. రెవిన్యూ శాఖకు సంబంధించి 150 వినతులు అండగా, డి.ఆర్.డి.ఎ కు 20, వైద్య శాఖ కు 7, గ్రామ, వార్డు సచివాలయాలకు 20, జిల్లా పంచాయతి అధికారి కి 13, మున్సిపల్ శాఖకు 14, హౌసింగ్ కు 15, విద్యుత శాఖ కు 5 చొప్పున వినతులు అందాయి.