Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందించండి

విశాలాంధ్ర,సీతానగరం: ఐదు దశాబ్దాల క్రితం కొమరాడ మండలంలోని జంఝావతి వద్ద ఏర్పాటుచేసిన జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి దీని పరిదిలోగల గ్రామాలకు సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.
ఈసమస్య పరిష్కారం కోరుతూ ముందుగా ప్రోజెక్టు పరిదిలోగల అన్ని సచివాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దీన్ని ప్రారంభం చేయగా, ఇప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒడిశా రాష్ట్రంతో సంప్రదించి దీనిపై ఉండే ఇరు రాష్ట్రాల వివాదాలు తొలగించి ప్రోజెక్టు ద్వారా సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్త చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం జోగమ్మపేట సచివాలయంలో ఇప్పలవలస, పాపమ్మ వలస గ్రామాలకు చెందిన రైతులు వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. జంఝావతి ప్రాజెక్టు సమస్య పరిష్కారం చేసి సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ఇప్పలవలస సర్పంచ్ చింతల లక్ష్మణరావు, గుల్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img