Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఈనెల 5నుండి ప్రభుత్వ డిగ్రీకళాశాల అధ్యాపకులకు ఆంగ్లభాష నైపుణ్యతపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహణ

నోడల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల
విశాలాంధ్ర,పార్వతీపురం: స్తానిక ప్రభుత్వ శ్రీవేంకటేశ్వర డిగ్రీకళాశాలలో సోమవారం నుండి నెలరోజులపాటు బ్యాచులవారీగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఆంగ్లభాష పరిజ్ఞాననైపుణ్యత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నోడల్ కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక ప్రభుత్వ శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రకళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ (ఐఎఎస్) ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఆంగ్లంలో బోధనా నైపణ్యతపెంచేందుకు, ఇంగ్లీష్ స్కిల్స్ అధ్యాపకులలో పెంచేందుకు రాష్ట్రస్తాయిలో 18నోడల్ రిసోర్స్ సెంటర్లలో ఈశిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ అధ్యాపకులకు, పిడిలకు, లైబ్రరియన్లకు శిక్షణతరగతుల నుండి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈశిక్షణా తరగతుల కార్యక్రమాన్ని విజయవాడ ఎస్ ఆర్ ఆర్ అండ్ సి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 5న(సోమవారం) నాడు ప్రారంభం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు తప్పనిసరిగా ఆరురోజుల నాన్ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులకు హాజరు కావాలని కమీషనర్ అదేశాలు ఇప్పటికే జారీచేశారని తెలిపారు.
స్థానిక ప్రభుత్వ శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మొదటి బ్యాచులో రెండు జిల్లాలోని 11ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 49 మంది అధ్యాపకులకు ఇవ్వడం జరుగుతుందని నోడల్ రిసోర్స్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. ఈశిక్షణ తరగతులకు కోర్సు
కో-ఆర్డినేటరుగా కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకులు బి. శాంతకుమారి వ్యవహరిస్తారని చెప్పారు. సాలూరు, రాజాం,విజయనగరం, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన నలుగురు అధ్యాపకులు మాస్టర్ ట్రైనర్లగా ఉంటారని తెలిపారు. శిక్షణకు సంబందించి అన్ని ఏర్పాట్లను సిద్ధంచేసామని చెప్పారు. శిక్షణను ఆన్లైన్ ద్వారా కొన్ని అంశాలపై నిపుణులు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, మరికొన్ని అంశాలపై మాస్టర్ ట్రైనర్లగా నియమించబడిన నలుగురు అధ్యాపకులు శిక్షణ ఇస్తారని తెలిపారు. స్థానిక నోడల్ కేంద్రమైన ప్రభుత్వ శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో పార్వతీపురం, జిఎల్ పురం, వీరఘట్టం,పాలకొండ, సాలూరు,
సీతంపేట, గజపతినగరం,రాజాం, చీపురు పల్లి, విజయనగరంలోని (రెండు) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img