Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

24 గ్రామపంచాయతీల గ్రామవాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహణ

194మంది వాలంటీర్లకు సత్కారం…
విశాలాంధ్ర,సీతానగరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయవ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలు జగన్ మోహన్రెడ్డి మానస పుత్రికలని, వారి సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీటవేస్తూ అన్ని కార్యక్రమాల్లో వారినే ముందంజలో ఉంచడం జరుగుతుందని ఎమ్మెల్యే అలజింగి.జోగారావు తెలిపారు. మంగళ వారం సీతానగరం ఎంపిడిఓ కార్యాలయం ఎదుటఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ అధ్యక్షతన మండలంలోని పెదభోగిలి-1, అంటిపేట, కాశాపేట, లచ్చయ్యపేట, పెదభోగిలి-2, చినబోగిలి, తామరఖండి, బగ్గందొరవలస, గెడ్డలుప్పి, జోగంపేట, రంగంపేట, దయానిధిపురం, ఆర్ వెంకమ్మపేట,గాదెలవలస గ్రామ సచివాలయంల పరిధిలోని 24గ్రామ పంచాయతీలకు చెందిన194మంది గ్రామ వాలంటీర్లకు వందనకార్యక్రమం ద్వారా ఘనంగా సత్కరించారు.గత మూడేళ్లుగా వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరిట ప్రభుత్వం సత్కారం చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కూడా వాలంటీర్లకు రానున్న కాలంలో నాయకులుగా తయారు చేస్తామని ప్రకటించడం చూస్తే మీకు ఇస్తున్న ప్రాధానత్య ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు.ఇప్పటికే ప్రతీ వాలంటీర్ ఖాతాలలో సేవావజ్ర క్రింద 30వేలు, సేవా రత్న ద్వారా 20వేలు, సేవామిత్ర ద్వారా 10వేలు నగదును ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. మండలంలోని ఇద్దరు వాలంటీర్లకు సేవావాలంటీర్లను సచివాలయాల వారిగా శాలువాలు కప్పి, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు.సీఎం జగన్ మోహన్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు కావాలని, రానున్న సాధారన ఎన్నికలలో వైఎస్సార్సీపీప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.ప్రభుత్వం సంక్షేమం, అభివృద్థి పనులను గత నాలుగేళ్లలో పెద్దఎత్తున చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో వాలంటీర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయసలహా మండలిచైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, జెడ్పీటీసీలు బాబ్జి,రవికుమార్, బలగ రేవతమ్మ,సీతానగరం ,బలిజి పేట,పార్వతీపురంపార్టీఅద్యక్షులు బొంగు చిట్టిరాజు, పి. మురళికృష్ణ, బొమ్మి రమేష్, ఎంపిపిలు మజ్జి
శోభలత, గుడివాడ నాగమణి, వైస్ ఎంపిపిలు సూర్యనారాయణ, సిద్దా జగన్నాధం, వెలిది సాయిరాం, పోల ఈశ్వర నారాయణ, సురగాల గౌరీకిరణ్, బురిడి సూర్యనారాయణ, యూ సురేష్, కృష్ణమూర్తి, ఎన్ రామకృష్ణ, కృష్ణంనాయుడు,రత్నాకర్, తిరుపతిరావు, దాసరి నాగరత్నం, ఆర్వీ పార్థసారథి, రమేష్,రామారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, 35గ్రామ పంచాయతీల కార్యదర్శులు, కీలకనాయకులు,కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు, సోషల్ మీడియ కన్వీనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img