విశాలాంధ్ర,సీతానగరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తిచేసుకొని ఐదేళ్లలో అడుగుపెట్టిన సందర్భంగా,జగనన్న సంక్షేమపాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో నియోజకవర్గ పరిదిలో ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లతో అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహించారు.సీతానగరం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన బహిరంగసభలోముందుగా కేకునుకోసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందరి ఆశీస్సులు కావాలని, రానున్న సాధారణ ఎన్నికలలో అంతా కలిసికట్టుగా పనిచేసి అత్యదిక మెజారిటీతోవైఎస్సార్సీపీప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పార్టీ సమాంతరంగా పనిచేస్తూ సంక్షేమం, అభివృద్థి పనులు గత నాలుగేళ్లలో పెద్దఎత్తున చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఆయనతోపాటు నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధులు, నాయకులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అభివృద్ధిని కొనియాడారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయసలహా మండలిచైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, జెడ్పీటీసీలు బాబ్జి,రవికుమార్, బలగ రేవతమ్మ,బలిజి పేట,పార్వతీపురంపార్టీ అద్యక్షులు మురళి కృష్ణ, బొమ్మి రమేష్, ఎంపిపిలు మజ్జి
శోభలత, గుడివాడ నాగమణి, వైస్ ఎంపిపిలు సూర్యనారాయణ, సిద్దా జగన్నాధం, వెలిది సాయిరాం, పోల ఈశ్వర నారాయణ, సురగాల గౌరీకిరణ్, బురిడి సూర్యనారాయణ, యూ సురేష్, ఎన్ రామకృష్ణ, కృష్ణంనాయుడు,రత్నాకర్, తిరుపతిరావు, నియోజక వర్గంలోని మూడు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, కీలకనాయకులు,కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు, సోషల్ మీడియ కన్వీనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.