విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని ప్రాదమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు రుత్తల ఉమా మహేశ్వరరావు( నిడగల్లు-1), కాతా కళ్యాణి (ఇప్పలవలస)లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ ప్రేమ్ కుమార్, ఎమ్మెల్యే జోగారావు చేతులమీదుగా మంగళవారం జిల్లా కేంద్రంలో అవార్డులు తీసుకున్నారు.వారిని ఎంఈఓలు సూరిదేముడు, వెంకట రమణ, నిడగల్లు ఉన్నతపాఠశాల హెచ్ ఎం శివున్నాయుడు, ఆయాపాటశాలల సిబ్బంది,తల్లిదండ్రులు , విద్యార్ధులతో పాటు మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.