Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జర్నలిస్టుల పోరాటానికి సిపిఐ మద్దత్తు..

విశాలాంధ్ర-విజయనగరం : విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ఉదయం జర్నలిస్టుల నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టు లు చేస్తున్న న్యాయమైన పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) తరపున సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అనుకుంటే వారికి చెందిన భూముల్లో ఇచ్చుకోవాలన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ళ స్థలాలని కబ్జాలకి పాల్పడతారా అని మండిపడ్డారు.. ఇదేమి అన్యాయమని రెవెన్యూ అధికారులను అడిగితే కనీసం ఖాతరు లేకుండా నిర్లక్ష్యంగా సమాధామిస్తున్నారన్నారు. .. తక్షణమే కే.ఎల్ పురంలో జర్నలిస్టుల కాలనీలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఆక్రమణలు తొలిగించాలని, జర్నలిస్టులకి కేటాయించిన ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకె ఇవ్వాలని, ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ళను నిర్మాణం చేసి పట్టాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ, మండల అధ్యక్షులు ప్రసాదుల ప్రసాద్ రావు, బొద్దుల నరసింగరావు, జనసేన నాయకులు గురాన అయ్యలు, బాలు, ఆమాద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దయానంద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గొర్లి శ్రీనివాస్ నాయుడు, లోక్ సత్తా నియోజకవర్గ ఇంచార్జ్ నాగభూషణ్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి సతీష్ , సీనియర్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు తమ సంఘీభావం తెలిపారు. పట్టణ జర్నలిస్టులంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img