Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

సీతానగరం ఆనకట్ట కుడి, ఎడమ కాలువల సాగు నీరు విడుదల

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలో గల సుమారు 10 గ్రామాలకు సాగునీరు అందించే కొత్తవలస ఆనకట్ట కాలువలు ద్వారా సాగునీరును ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతోకలిసి ఆనకట్ట వద్ద పూజలు చేసికుడి, ఎడమ కాలువల ద్వారా బుదవారం విడుదల చేశారు.ఈఆనకట్ట పరిధిలోసుమారు 3,850 ఏకరాల పంట పొలాలకు ఖరీఫ్ సీజన్లో వరినాట్లు వేసుకునేందుకు సాగునీరు ఎంతగానో రైతన్నలకు దోహద పడుతుందన్నారు. ఆయుకట్టు పరిదిలోని చివరి ఎకరావరకు కూడా సాగు నీరు అందించడం కొరకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు మామిడి బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, మాజీ అనకట్ట ఛైర్మన్ తెంటు వెంకటఅప్పల నాయుడు, సీనియర్ నాయకులు పోల ఈశ్వర నారాయణ, మర్రాపు ధనుంజయ, ఆయా గ్రామాల సర్పంచులు తిరుపతి నాయుడు,నారాయణరావు, రెడ్డి అప్పల నాయుడు, అప్పారావు, శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు పి సత్యన్నారాయణ, సూర్యనారాయణ,బుజ్జి, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img