Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దాసరి త్రినాథ

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా డిజిఎస్వి త్రినాథ గురువారంనాడు బాధ్యతలు చేపట్టారు.ఇంతవరకు ఇక్కడ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన బొబ్బిలి రేణుకకు కొమరాడ కళాశాలకు బదిలీ జరిగిన సంగతి తెలిసిందే.దీంతో ఇక్కడ సీనియర్ అధ్యాపకులు త్రినాథ్ కు ఎఫ్ఏసి బాధ్యతలు అప్పగిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.దీంతో ఆయన ప్రిన్సిపాల్ గా బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్భంగా కొత్త ప్రిన్సిపాల్ త్రినాథ మాట్లాడుతూ తన స్వంత మండలంలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలను చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.తనబాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ కళాశాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.ఉన్నత అధికారుల అదేశాలు, సూచనలు, సలహాలను పాటించి కళాశాల అభివృద్ధికీ కృషి చేస్తానని చెప్పారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన త్రినాధను కొమరాడ ప్రిన్సిపల్ వై. నాగేశ్వరరావు, ఇంతవరకు ప్రిన్సిపాల్ గా ఉన్న బి .రేణుక,పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎకనామిక్స్ లెక్చరర్ తెర్లి రవికుమార్, కళాశాల అధ్యాపకులు ప్రతాప్ కుమార్, ఆర్వీ ప్రసాదరావు, దాసరి రామకృష్ణ, అల్లాడ రామారావు, వినోద్ కుమార్,చంద్రావతి,శ్రీధర్,అమ్మాజీ,మయూరి, వసంత్ కుమార్,ఇందిరా, నవీన్ కుమార్, నాన్ టీచింగ్ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img