Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

మూడు వార్డుసభ్యులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని జోగమ్మపేట గ్రామపంచాయతీలోని రెండు వార్డు స్థానాలకు, లచ్చయ్యపేటలోని ఒక వార్డు సభ్యునికి చెందిన ఎన్నికకు మంగళ వారం నోటిఫికేషన్ జారీచేసినట్లు ఎంపిడిఓఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలిపారు. జోగమ్మపేటలో నామినేషన్లు స్వీకారానికి అధికారిగా ఈఓ పిఆర్డీ వర్మ, లచ్చయ్యపేటకు ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈఈ పవన్ కుమార్ లను నియామకం చేసినట్లు చెప్పారు. వారు ఆయా గ్రామాల్లోని సచివాలయంలో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరణ చేస్తారని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు మురళి, కిరణ్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img