Friday, December 8, 2023
Friday, December 8, 2023

దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు

రైతుల పక్షాన పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం

రాష్ట్ర మాజీమంత్రి ,సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ రఘువీరా రెడ్డి.

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : దేశవ్యాప్తంగా రోజురోజుకు రైతులు యొక్క ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతుల పక్షాన పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మాజీమంత్రి సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక ఎత్తు బ్రిడ్జి వద్ద నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సి డబ్ల్యూ సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్న నేడు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని సగటున రోజుకి ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలలో చలనం లేదన్నారు. దేశంలో రాష్ట్రంలో వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో వ్యవసాయానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోయినప్పటికీ రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామన్నారు కనీసం రాష్ట్రం నుండి కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి నివేదిక కూడా పంపించ లేకపోవడం అత్యంత దారుణం అన్నారు రాష్ట్రంలో నీరు కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని గానీ మార్కెట్లో మాత్రం కిలో బియ్యం 60 రూపాయలకు పైగా ఉందన్నారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీ రైతుల యొక్క అభివృద్ధి కొరకే పాటుపడిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, జిల్లా ఇన్చార్జి రాకేష్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img