Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఆయిల్ పామ్ ద్వారా అధికలాభాలు

జిల్లా హార్టికల్చర్ అధికారి రెడ్డి
విశాలాంధ్ర,సీతానగరం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారముతోఆయిల్ పామ్ రైతులకు మెరుగైన సేవలు అందించడం వల్ల అధిక దిగుబడులుసాధించి లాభాలు సాధించవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.గురువారం మండలంలోని బగ్గం దొరవలస వద్ద ఉన్న శ్రీ శ్రీనివాసా పామాయిల్ నర్సరీ వద్ద నిర్వహించిన మెగా పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పెద్ద ఎత్తున మొక్కలు పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈసంధర్భంగా ఏర్పాటుచేసిన పామాయిల్ రైతులసమావేశంలో పామాయిల్ ప్లాంటేషన్ గూర్చి రైతుల సందేహాలను నివృత్తి చేశారు మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం గూర్చి వివరించారు.గురువారం అన్ని ప్రాంతాల్లో పామాయిల్ ప్లాంటేషన్ పెంపకానికి సంబందించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అవగాహణ కల్పించడం జరిగిందన్నారు.రైతులు ఇతర పంటలలో పెట్టుబడి, కూలీల కొరత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పామాయిల్ ప్లాంటేషన్ పెంపకానికి దృష్టి పెట్టాలని కోరారు.రాయితీపై మొక్కలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ హార్టికల్చర్ ఆఫీసర్ క్రాంతి,మండల హార్టికల్చర్ ఆఫీసర్ ప్రత్యుష, కంపెనీ ఎండి పి.పాండురంగారావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ పి.మణిదీప్ కృష్ణ, ప్లాంటేషన్ మేనేజర్ జి.వీరబాబు , ప్లాంటేషన్ మరియు నర్సరీ ఇంచార్జి కె.శ్రీనివాసరావు , ప్రజాప్రతినిధులు తిరుపతినాయుడు, నారాయణ రావు,కర్రి శ్రీరాములు, రెడ్డి గోపీనాథ్,కర్రి శంకరరావు పామాయిల్ రైతులు కొట్యాడ శంకరరావు, దామినేని సతీష్ తదితర రైతులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img