విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : శ్రీ చైతన్య పాఠశాల వ్యవస్థాపకులు బి. ఎస్ రావు ప్రథమ సంస్మరణ సభ పట్టణంలో ఉన్న రింగ్ రోడ్డు బ్రాంచ్ వద్ద ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలరీజ నల్ఇంచార్జ్ వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆయన విద్య పరంగా చేసినటువంటి సేవలు పిల్లలకు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి ఎస్ రావు మాట్లాడుతూ కమిట్మెంట్ పిల్లలపై శ్రద్ధ విశేషమైనటువంటి లక్ష్యా లను పిల్లలకు తెలియజేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొని డాక్టర్ బి. ఎస్. రావు కి నివాళులు అర్పించారు.