Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

పెదంకలంలో జగనన్న సురక్ష కార్యక్రమం

విశాలాంధ్ర,సీతానగరం: అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎంపిపి బలగ రవనమ్మ తెలిపారు.మంగళవారం మండలంలోని పెదంకలం గ్రామసచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమములో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎంపిపి చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకుఈఓపిఆర్డీ తెలిపారు.
ఈకార్యక్రమంలోటీమ్ లీడర్ ఈఓపిఓ ఆర్డీ వర్మ,జడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, పెదంకలం, సుమిత్రపురం, కృష్ణ రాయపురం సర్పంచులు బలగ శ్రీనివాసరావు, మూడడ్ల ఉమా గునుపూరు అన్నంనాయుడు, ఎంఈఓ వెంకటరమణ, సెక్రటరీలు గౌరీశ్వరి, శ్రీనివాసరావు, సోమేశ్వర రావు, వి ఆర్ ఓ బాబూరావు సచివాలయం సెక్రటరీ ఉద్యోగులు, మూడు పంచాయతీల వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ధృవీకరణ పత్రాలు తీసుకున్న లబ్దిదారులు థాంక్స్ సీఎం అని కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img