విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని ఈనెల 30నుండి నవంబర్ 1వరకు 21గ్రామ సచివాలయంలలో నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్షపై విస్కృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ ప్రసాద్, తహశీల్దార్ ఎన్వీ రమణ సీతానగరం, పెదంకలం వైద్యులు శిరీష,ఉషారాణి, రాధాకాంత్ లు తెలిపారు. ప్రజలు, రోగులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపిడిఓ, వెలుగు ఏపీఎం, ఆర్ఐ ఆధ్వర్యంలో ఒకటీం,తహశీల్దార్, ఈఓపిఆర్డీ, ఉపాధి హామీ పథకం ఏపిఓ ఆద్వర్యంలో రెండో టీం ఉంటుందని తెలిపారు. వీరితో పాటు మండలస్థాయి అన్నిశాఖల అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఎంపీడిఓ టీం ఆధ్వర్యంలో ఈనెల 30న బూర్జ, అక్టోబర్ 4న నిడగల్లు,6న వెంకటపురం, 10న లక్ష్మిపురం, 17న దయానిధిపురం, 19న గాదెలవలస, 24న పెదభోగిలి-1లో, 26న పెదభోగిలి-2లో, 31న తామర ఖండిలో క్యాంపులు ఉంటాయని చెప్పారు.తహశీల్దార్ టీంలో అక్టోబరు 3న అంటిపేట, 5న బగ్గందొరవలస, 7న చిన భోగిలి, 11న గుచ్చిమి, 13న గెడ్డలుప్పి, 18న జోగమ్మపేట, 20న కాసాపేట, 25న లచ్చయ్యపేట, 27న ఆర్ వెంకమ్మపేట, నవంబర్ 1న సూరమ్మపేటలో ముగుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక వైద్య నిపుణులు విచ్చేసి తనిఖీలు నిర్వహించి మందులు ఇస్తారని తెలిపారు.