విశాలాంధ్ర,పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 31న సాలూరులో జరగనున్న జాబ్ మేళాకు సంబందించి గోడ పత్రికలను మంగళవారం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ విడుదల చేశారు.ఉపాధికల్పనలో భాగంగా 10వ తరగతి నుండి యుజి డ పిజి కోర్సులలో ఉత్తీర్ణత సాధించి వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకులకు ఈనెల 31న శుక్రవారం నాడు సాలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటిసి) మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈమెగా జాబ్ మేళకు 12 బహుజన కంపెనీ ప్రతినిధులు హాజరయ్యి,అర్హతకలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఎంపిక చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి, యువకులు తమ వివరాలను షషష.aజూంంసష.ఱఅ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబరుతో పాటుగా హాజరు కావాలని కోరారు.అభ్యర్ధులు వారి బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, ఒరిజినల్ మరియు జెరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావలసినదిగా ఎపిఎస్ఎస్ డిసి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యూ.సాయి కుమార్ కోరారు.
మరిన్ని వివరాలకు 8555909899, 6305110947, 6303493720, 9494777553 నెంబర్ల నందు సంప్రదించాలన్నారు.