Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరండి: ప్రిన్సిపల్ బి రేణుక

విశాలాంధ్ర,సీతానగరం: స్తానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులలో చేరండని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక విజ్ఞప్తి చేశారు.గురువారం ఆమె ఆధ్వర్యంలో అధ్యాపకులు నాలుగు బృందాలుగా ఏర్పడి మండలంలోని చినబోగిల, తామరకండి, బగ్గందొరవలస, బల్ల కృష్ణాపురం తదితర గ్రామాల్లో అడ్మిషన్లు కొరకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రైవేటుకు ధీటుగా విద్యను అందించే కళాశాలని వారు ప్రచారాన్ని చేశారు. అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలని వారు తెలిపారు.పదోతరగతి పాస్ అయిన విద్యార్థులవద్దకు వెళ్లి ప్రభుత్వ కళాశాలలో ఉన్నసౌకర్యాలను, లబ్ తదితర అంశాలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కళాశాలలో బోధన, పలితాలు, మౌలిక సదుపాయాలు కల్పన గూర్చి వివరించారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు తెర్లి రవికుమార్, దాసరి రామకృష్ణ , అల్లాడ రామారావు ,నవీన్, వినోద్, అచ్చంనాయుడు, రమేష్ ,మోహన్ రావు, వసంత్ కుమార్, అరుణ్ కుమారి అమ్మాజీ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img