విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని కొత్తవలస గ్రామ పంచాయతీలో ప్రజల ఆరోగ్యం, గ్రామపంచాయతీ అభివృద్దే తన ప్రధాన ధ్యేయమని సర్పంచ్ రెడ్డి అనిత అప్పలనాయుడు తెలిపారు.దోమలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా,పరిశుభ్రత లేకపోతే ఊరంతా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని గుర్తించి పరిసరాల పరిశుభ్రత,గ్రామంలో క్లోరినేషన్, కాలువల్లో బ్లీచింగు చల్లించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారని తొలగించడం, దోమల బెడద ఎక్కువగా ఉన్నందున దోమల మందు స్ప్రే చేయించడం, పిచ్చి మొక్కలు తొలగించి గాబుమందు పిచికారీ చేయడం,నీళ్ల ట్యాంకులు శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి పనులు పంచాయతీలో చేపట్టారు. ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే జోగారావు చేయూతతో పాటు పదవీ విరమణ చేసిన తన భర్త సహాకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ రెడ్డి అనిత అప్పల నాయుడు తెలిపారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గౌతమి,పంచాయతీ వార్డు సభ్యులు, హరితరాయబారులు, వాలంటీర్లు, గ్రామ పెద్దలు,ప్రజలందరి సహాకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.