విశాలాంధ్ర,సితానగరం: మండలంలోని లక్ష్మీపురం గ్రామాన్ని రాష్ట్ర టిడ్కోఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ సోమవారం సందర్శన చేశారు. గ్రామంలో రైతులతో పలు అంశాపై మాట్లాడారు.చెరకు కర్మాగారం ఎత్తివేతపై రైతులు నిలదీశారు.ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని చెరకు సంకీలి వైపు తరలించి దళారుల ప్రమేయంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సత్యవతి, ఎంపీటీసీ పార్వతమ్మ గంగునాయుడు ఇతర గ్రామపెద్దల ఆహ్వానం మేరకు సందర్శన చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామములో ఉన్నటువంటి రోడ్డు సదుపాయాలను అక్కడి రైతులు మరియు నాయకులతో కలిసి పరిశీలించి,అవసరమైన చోట వెనువెంటనే బాగుచేసే విధముగా సంభందిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగునాయుడు, శ్రీనివాస్ పువ్వల అప్పారావు, రాము,,మాజీ సర్పంచ్ గాజాపు వెంకట నాయుడు, చప్ప ఉమా మహేశ్వర రావు,గవర చిన్నంనాయుడులు పాల్గొన్నారు.