డిఆర్ఓ ఎస్.డి అనితకు ఏఐఎస్ఎఫ్ వినతి
విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డిఆర్ఓ ఎస్ డి అనితకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. నాగభూషణం మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు ఆకలి తీర్చే మధ్యాహ్నం భోజన పథకం గత ప్రభుత్వం ఆపి వేయడం వలన చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శాతం తగ్గడానికి ప్రధాన కారణం అన్నారు. ఈ ప్రభుత్వంలో కచ్చితంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆకలి తీర్చాలని కోరారు.అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగున పడ్డ టాయిలెట్ బాత్రూంలను రీ మోడలింగ్ చేయాలని కోరారు. మధ్యాహ్నం భోజన పథకం ను నిర్వీర్యం చేస్తే కచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యార్థుల ఐక్యం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పి.గౌరీ శంకర్ పట్టణ కార్యదర్శి ఏ.సుమన్ కార్యవర్గ సభ్యులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు