మెచ్చుకున్న జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, అధికార యంత్రాంగం
విశాలాంధ్ర,పార్వతీపురం : చిరుదాన్యాల వినియోగంలో ఉండేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జిల్లాలోని డి ఆర్ డి ఏ, వ్యవసాయ శాఖ, ఏపీ సిఎన్ఎఫ్, ఐసిడిఎస్, స్వచ్ఛంద సంస్థలు ఆద్వర్యంలో ఐటీడిఏ లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవాన్ని (మిల్లెట్ మహోత్సవాన్ని) జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.అనంతరం ఐటీడిఏ
.ఆద్వర్యంలో ఆయా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చిరుదాన్యాల స్తాల్లును పరిశీలించారు.చిరు ధాన్యాల ప్రాధాన్యత, తయారు చేసే విధానం గూర్చి వారంతా జిల్లా కలెక్టర్ కు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.
చిరుధాన్యాలు స్టాళ్లు పరిశీలించగా
యన్. శ్యామలదేవి ఆధ్వర్యంలో విజయనగరంజిల్లా జామి నుండి వానిల్ స్నాక్స్ హబ్ వారు చిరుధ్యానాల ఉత్పత్తులయిన వంటి రాగులు, కొర్రలు, ఊదలు, అరికలు, సాములు, గంటిలతో తయారు చేసిన తినుబండరాలు,నూడిల్స్ స్టాల్లో ప్రదర్శించారు. జట్టు సంస్థనుండి.డా. డి.పరినాయుడు ఆధ్వర్యంలో జట్టు నేచురల్స్ మాభూమి అన్నపూరనేశ్వరి, గిరిశక్తి, మరియు ఆదితల్లి రైతుఉత్పత్తిదారుల సంఘాల ఉత్పత్తులను నాబార్డ్, ఆర్. వై. ఎస్. ఎస్, డి. జి. టి సహకారంతో చిరుధన్యాలుతో కూడినఒక స్టాల్ ను ఏర్పాటుచేసారు.
వ్యవసాయ శాఖ -ఏపీ సియన్ఎఫ్ సహకారంతో జిల్లాలో ఉన్న 15 మండలాలకు సంబందించిన చిరుధన్యాలు ,ఉత్పత్తులను స్టాల్ లో ఏర్పాటు చేసారు.జిల్లా మహిళాభ్యుదయం మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కె. విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిరుధన్యాలతో తయారుచేసిన తినుబండరాలను స్టాల్ లో ప్రదర్శించారు . గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి గ్రామానికి చెందిన ఎం రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ వారి సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిలు – సిరులను స్టాల్ లో ప్రదర్శించారు.డి. కళ్యాణ్ పాత్రో ఆధ్వర్యంలో వాషన్ మిల్లెట్ మిక్సీయి అనే పేరుతో రైతులకు ఉపయోగపడే యంత్రాలను స్టాల్లో ప్రదర్శించారు
యస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో
గిరివికాసం అనే పేరుతో వెలుగు అసోసియేషన్, కొత్తూరువారు చిరుధన్యాలను స్టాల్లో ప్రదర్శించారు.
డి ఆర్ డి ఏ- వెలుగు పార్వతీపురం ఆధ్వర్యంలో చిరుధన్యాలుతో కూడిన పదార్దాలను స్టాల్ లో ప్రదర్శించారు
యన్. సన్యాసిరావు ఆధ్వర్యంలో పెద్దపేట గ్రామం,బూర్జ మండలం నుండి యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్ (ARుూ) నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో చిరుధన్యాలను స్టాల్లో ప్రదర్శించారు.
డా. అనురాధ ఆధ్వర్యంలో ఆచార్య యన్. జి రంగా అగ్రికల్చవ్యవసాయ విశ్వవిద్యాలయం రస్తాకుంటుభాయి కే.వి. కే చిరుధన్యాలను స్టాల్ ప్రదర్శించారు. విశేష ప్రతిభ కనబరిచిన వారందరికీ ప్రశంసలు, సత్కారాలు, సన్మానాలు చేశారు.