Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తామరకండి – బక్కుపేట గ్రామాలమధ్య గల 2.65 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపనచేసిన ఎమ్మెల్యే అలజంగి

విశాలాంధ్ర,సీతానగరం : రెండు గ్రామాల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం బిటి రహదారి నిర్మాణానికి బుదవారం ఎమ్మెల్యే జోగారావు శంఖుస్థాపన చేశారు.రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ పక్కా బీటీ రహదారిని నిర్మించడం జరుగుతుందని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం 2.65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం కొరకు జిజీఎంపి 20 లక్షల రూపాయలు నిధులతో మొదటి విడతగా 600 మీటర్ల బిటి రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారి చేతుల మీదుగా మండల, గ్రామ ప్రజా ప్రతినిదులు, నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జడ్పిటిసి మామిడి బాబ్జి, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, మండల సీనియర్ నాయకులు పోల ఈశ్వర నారాయణ, మర్రాపు ధనుంజయ, తెంటు వెంకట అప్పలనాయుడు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఏగీరెడ్డి గౌరీశ్వరి, పిఎసిఎస్ చైర్మన్ మూడడ్డ్లమన్మధరావు, నాయకులు ఏగిరెడ్డి శ్రీనివాసరావు, ఎగిరెడ్డి స్వామి నాయుడు, మూడడ్డ్ల శంకరరావు, బి అప్పారావు, వీవిధి గ్రామాల సర్పంచులు గొట్టాపు అప్పారావు, నారాయణరావు, కురమన శ్రీనివాసరావు, రెడ్డి అప్పల నాయుడు, చింతాడ కృష్ణ, అధికారులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img