విశాలాంధ్ర-విజయనగరం టౌన్ శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ను ఆలయ ధర్మకర్త పాకలపాటి సన్యాసి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ని శంకరమఠం సమీపంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తులు చే విశేషంగా పూజలు అందుకుంటుందన్నారు. గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుగుతాయన్నారు.