Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రెండోరోజు రెండోగోతిని కప్పిన ఆర్ అండ్ బి అధికారులు

విశాలాంధ్ర,సీతానగరం: ఆర్ అండ్ బి అధికారుల తీరుకు నిరసనగా,సీతానగరం మండల కేంద్రంలోని రోడ్డుపై జిల్లా కలక్టర్ కు సోమవారం ఎమ్మెల్యే జోగారావు మండలనాయకులతో కలిసి పిర్యాదుచేయగా మంగళవారం ఆర్అండ్ బి  ఎఈ రామ్మోహనరావు, గుత్తేదారు మురళిలు ఆరుయూనిట్ల వెట్ మిక్స్ ను పెద్దలారీతో తెప్పించి,జెసిబిద్వారా స్థానిక నాయకుల సూచనల మేరకు బజారులో ప్రదానగోతిని కప్పిపెట్టగా,బుదవారం రెండోరోజు స్తానిక సచివాలయంవద్ద ఉన్న మరో పెద్దగోతిని మరో ఆరుయూనిట్ల వెట్ మిక్స్ తెప్పించి కప్పించారు. ఎమ్మెల్యే జోగారావు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడంతోపాటు ఆర్ అండ్ బి అధికారులపై గుర్రుగా ఉండటంతో పాటు శుక్రవారం మొదటిసారిగా సీతానగరం మండలంలోని జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల ఆద్వర్యంలో నిర్వహించడంతో రోడ్డుకు కొంతమోక్షం కలిగిందని ప్రజలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img