Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో అవసరం: జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం : ఆరోగ్యానికి చిరుధాన్యాలు అవసరం ఎంతో ఉందని, చిరుధాన్యాలలో మానవ ఆరోగ్యానికి అవసరమైనటువంటి కాల్షియం, ఇనుము, మెగ్నిషియం, భాస్వరం అనే ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.చిరుధాన్యాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాలలో కొవ్వు తక్కువ శాతంలో ఉండటంవలన రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుందని తెలిపారు. రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ఆహారంగా ఉపయోగపడతాయని, చిరుధాన్యాలపై పొరల్లో ఉన్న ఖనిజాలు ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. చిరుధాన్యాలు యొక్క ప్రాముఖ్యత, మానవ ఆరోగ్యం అనే విషయం పైన వ్యాసరచన పోటీలు మండలాల స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. చిరుధాన్యాల ఆహార పదార్థాలను స్టాల్స్ లలో అమ్మకానికి, ప్రదర్శనకు పెట్టే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో చిరు ధాన్యాలపై దృష్టి సారించాలని, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, టి.పి.ఎం.యు ఏపిడి వై. సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img