Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రీన్ అంబాసిడార్లకు వేతనాలు ఇప్పించండి మహా ప్రభో…

ఉపాధి హామీ పథకంలోవారికి అవకాశం కూడా ఇవ్వండి…
పంచాయతీలతో సంబంధం లేకుండా నేరుగా వేతనాలు ఇప్పించండని దీక్ష

విశాలాంధ్ర,సీతానగరం: మండలములో 35గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లుకు 12నెలల నుండి రావాల్సిన వేతనాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం పనులో అవకాశం కల్పించాలని, గ్రామపంచాయతీలతో సంబంధం లేకుండా నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ ఆఫీసు ముందు స్వచ్ఛభారత్ కార్మికులు (గ్రీన్ అంబాసిడర్లు ) ఒకరోజు దీక్షను గురువారం చేపట్టారు. గత 12నెలలుగా జీతాలులేక ఇతర పనులకువెళ్లలేక, ఆకలితో అలమటిస్తున్నామని వారునిరసనలో తెలిపారు.ఈదీక్షా శిబిరంలో సిఐటియు జిల్లా కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ,2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగాపచ్చదనం పరిశుభ్రత పేరుతో గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. గ్రామాల్లో హరిత రాయబారులుగా నియమించి వీరి జీతాలను ప్రభుత్వమే చెల్లించేదని,
వీరిజీతాలు రెండు మూడు నెలలకు స్వచ్ఛఆంధ్ర మిషన్ ద్వారా చెల్లింపులు జరిగేవని, 2022 సంవత్సరంలో వీరిని పంచాయతీలో విలీనంచేసినతర్వాత కష్టాలు మొదలయ్యాయన్నారు. వీరితో పంచాయతీలు, ప్రభుత్వఅధికారులు వెట్టి సాకిరి పనులు చేయించుకుంటున్నారు తప్ప జీతాలు చెల్లించడంలో శ్రద్ధ చూపడంలేదన్నారు. కావున గతంలో మాదిరిగా బకాయి వేతనాలు చెల్లింపులు చేయాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లు కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కోవిడ్ విధులు నిర్వర్తించారని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం లో ముందంజలో ఉన్న వీరిని ప్రభుత్వం నిర్ల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img