Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఎమ్మెల్యే అలజంగి జోగారావుసమక్షంలో పార్టీలోచేరిన నిడగల్లు జన సైనికులు

విశాలాంధ్ర,సీతానగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న సుపరిపాలనపై ఆకర్షితులైన నిడగల్లు గ్రామానికీ చెందిన జనసైనికులు కర్రి శంకరరావు, బర్ల వెంకటరమణ, బర్ల మాధవలు తదితర 70మంది జనసేన యువకులు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీ పార్టీలో బుదవారం చేరారు.మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే అలజంగి జోగారావును క్యాంప్ కార్యాలయంలో కలవగా వారందరినీ పేరు పేరున ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి కండువావేసి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.
మీఅందరిఆశయాలకు అనుగుణంగా మీరుకోరిన విధంగా నిడగల్లు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పూర్తిభరోసాను ఇచ్చారు. రానున్న సాదారణ ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైయస్ జగన్ ను గెలిపించు కునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ తోడబండి సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల సీనియర్ నేత పోల ఈశ్వర నారాయణ, నిడగల్లు గ్రామపెద్ద గాజాపు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ బర్లసింహాచలం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img