విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని కె.వెంకటపురం గ్రామంలో గురువారం
డా. వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమంను ఏ ఓ అవినాష్ ఆద్వర్యంలో నిర్వహించారు.ఈకార్యక్రమంలో భాగంగా యాంత్రీకరణ విధానంలో వరినాట్లు వేసిన పొలం మరియు సాధారణ పద్దతిలో నాట్లు వేసిన పొలం లను పరిశీలించడం జరిగినది. సాధారణ పద్దతిలో పొలంలో యాంత్రీకరణ పద్దతిలో వేసిన పొలం కంటే ఎక్కువ కుదుళ్లు ఉండటం గమనించడం జరిగిందన్నారు.
ఇలా ఎక్కువకుదుళ్లు ఉండటం వలన మొక్కలకు గాలి వెలుతురు సరిగా తగలక ఎక్కువగా పీక పురుగు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.రైతులు తమ పొలములో తగిన దూరం ఉండేలా నాట్లు వేసుకోవాలని సూచించారు.
లేని యెడల పొలములో కాలిబాటలు తీసుకోవాలని తెలిపారు .దీనివల్ల మొక్కలకు గాలి వెలుతురు తగలడంతో పాటు ఎరువులు వేసుకొనుటకు, కలుపు నియంత్రణకు ఉపయోగ పడుతుందన్నారు.
ఆదేవిధంగా పోలంబడి పొలంనందు అగ్గితెగులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 మిఁలిఁ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు .
ఈపంట నమోదు ప్రతి ఒక్క రైతు చేసుకోవాలి అని తెలియచేశారు. ఈ పంట నమోదుకు సెప్టెంబర్ 15 వ తేది వరకు గడువు ఉందని తెలిపారు.దీని ద్వారా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇచ్చే ఎరువులు, ఇన్సురన్స్, ఇన్పుట్ సబ్సిడీ పొందవచ్చుని తెలిపారు.
ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితోపాటు గ్రామ సర్పంచ్ బుడితి శ్రీనివాసరావు, లంక సూరి సుబ్రమణ్యం బుడితి గౌరునాయుడు, బుడితీ ముకుందరావు, పొలంబడీ రైతులు, గ్రామపెద్దలు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.