విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని కె . వెంకటపురం గ్రామంలో డా వైయస్ఆర్
పొలంబడి కార్యక్రమం గురువారం ఏఓ అవినాశ్ ఆధ్వర్యంలో జరిగింది.యాంత్రీకరణ విధానంలో వరి నాట్లు వేయడం వలన రైతులకి బహుళ ప్రయోజనాలన్నాయని వ్యవసాయ అధికారి ఎస్.అవినాష్ తెలియచేశారు.
ఈపద్దతిలో వరి నారును ముందుగా ట్రేలలో పెంచుకొని 15-20 రోజుల నారును యంత్రశీతో ఉడవటం జరుగుతుందన్నారు.దీనికి ఎకరాకు 12 కేజీల విత్తనం సరిపోతుందన్నారు. దీని వల్ల రైతుకి ఉడుపుఖర్చు సాధారణ పద్దతి కంటే ఎకరాకు రూ.1800/- లు వరకు ఆధా అవుతుందన్నారు .ఈపద్దతివలన వరిలో కలుపుతీయుట, ఎరువులు వేయుట సులభతరమవుతుందన్నారు. పైరుకి గాలి,వెలుతురు బాగాతగిలి అధిక దిగుబడికి దోహదపడుతుందన్నారు.
అదేవిధంగా రైతులకి పాస్పో బాక్టీరియల్ ఇనాక్యులెంట్ అయిన ద్రవరూప జీవన ఎరువు ఇవ్వడం జరిగిందన్నారీ. దీనివల్ల భూమిలోని లభ్యముకానీ భాస్వరంను కరిగించి మొక్కకు అందించుననిచెప్పారు. మొక్కకు కావలసిన హార్మోన్లను కూడా అందించునని తెలిపారు. ఈకల్చరును పశువులఎరువు లేదా సేంద్రియఎరువుతో కలిపి విత్తనం నాటేసమయంలో లేదా నాటిన వారంరోజులలోపు పొలములో చల్లవలెనని తెలియచేశారు.
ప్రకృతి వ్యవసాయ పద్దతులలో భాగంగా దశపర్ని కసాయం తయారుచేయడం గూర్చి వివరించారు. దశ అంటే పది పర్ని అంటే పత్రం దశపర్ని అంటే పదిరకాల పత్రాలతో చేసే కషాయం ఇందులో వేప, జామ,జిల్లేడు, కానుగ, బొప్పాయి, ముసిదికి ఆకు, మునగ, మామిడి,వాయిలి ఆకు, సీతా ఫలం, పచ్చి మిర్చి, తెల్ల ఉల్లి రెండేసి కేజీల చొప్పున తీసుకొని 20 లీటర్ల గోవుమూత్రం, కేజి పసుపులో వేసుకొని ఒక డ్రమ్ములో కప్పి 40 రోజులు మురగనివ్వాలని తెలిపారు. 40రోజులతర్వాత పంట దశను బట్టి అన్ని పంటలకు వేసుకోవచ్చన్నారు.దీనివల్ల రసం పీల్చే పురుగు, లద్దే పురుగు, కాండం తొలుచు పురుగు, పచ్చ పురుగు, పెను బంక పైన సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.ఈకార్యక్రమంలో మండల వ్యవసాయధికారితో పాటు పోలంబడి రైతులు, గ్రామపెద్దలు, ఇతర రైతులు, గ్రామ వ్యవసాయసహాయకులు పాల్గొన్నారు.