Friday, December 8, 2023
Friday, December 8, 2023

పురందేశ్వరి మాటలన్నీ హంబోక్కేనా.. రాష్ట్ర ప్రభుత్వ స్కాములపై విచారణ జరిపించాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య.

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై వేల కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారని వాటన్నిటిపై సి.బి.ఐ ఎంక్వయిరీ చేయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో ఉన్న అమర్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్, మైనింగ్, ఇసుక వంటి వాటిపై సుమారు 36 వేల కోట్లు స్కాములు జరిగాయని చెబుతున్నారని ఇంత అవినీతి జరిగిన సిబిఐ విచారణకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వైసిపి నేతల పేర్లతో సైతం ఆధారాలు ఉన్నాయని చెబుతున్న బిజెపి ప్రభుత్వం ఎందుకు ఎంక్వయిరీ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి,వైసిపి సంబంధాలు బాగానే ఉన్నాయని అన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఈనెల 2 నుండి 18 వరకు కరువు జిల్లాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 18 బృందాలు పర్యటనలు చేపడుతున్నామన్నారు కరువుతో అల్లాడుతున్న రైతులకు సిపిఐ పార్టీ ఎన్నడూ అండగా నిలిచి ఉంటుంది అన్నారు జిల్లా అభివృద్ధి పేరుతో మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. అభివృద్ధి అన్నది జిల్లాలో పరిశ్రమలు తెరిపించినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటప్పుడు మాత్రమే జరుగుతుందన్నారు. ఈత చెట్టు, తాటి చెట్టు నాటడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img