విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని రంగంపేట సర్పంచ్ బొంగు భాస్కరరావు, ఉప సర్పంచ్ మరడ సత్యన్నారాయణలు తమ పదవులకు రాజీనామా చేసి,రాజీనామా పత్రాలను ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ కు మంగళవారం అందజేసారు.తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు. రంగమ్మపేట సర్పంచ్, ఉప సర్పంచ్లు సమర్పించిన రాజీనామ పత్రాలను జిల్లా గ్రామ పంచాయతీ అధికారికి పంపిస్తామని ఎంపిడిఒ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎన్నికల సమయంలో పెద్ద మనుష్యుల ఒప్పందం మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్లు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అంటిపేట సర్పంచ్ సిరికి మహేష్ 98డి. ఎస్సీకు ఎంపిక కావడంతో ఆయన ఆరునెలల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.