Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రెగ్యులర్ ఏఎన్ఎంలకు సచివాలయాల్లో సర్డుబాటు చేయాలి

విశాలాంధ్ర, పార్వతీపురం: వైద్య ఆరోగ్య శాఖలో గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయిలో సేవలు అందించడంలో ముందుండి అందరిలో గుర్తుకు ఉండే ఏ ఎన్ ఎం లను నేడు రేషనలైజేషన్ పేరిట సచివాలయాల్లో ఖాళీగా ఉన్నచోట నియామకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మొదటి ఏఎన్ఎం లకు, రెగ్యులర్ ఏఎన్ఎంలకు దీనివల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వారంతా వాపోతున్నారు. గతరెండేళ్ళుగా కరోనా సమయంలో వారుచేసిన సేవలకు ఆన్ని వర్గాలవారు ఎంతో అభినందించారు. వైద్యఆరోగ్య శాఖలో నాటినుండినేటి వరకు సేవలు అందించేందుకు వారు చేసిన కృషి అందరికి తెలిసిందే. ఈదశలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీఅందరికీ జీరో సర్వీసుతో బదిలీ చేయాలని మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏ ఎన్ ఎం లు డిమాండ్ చేస్తున్నారు.సచివాలయాల్లో ఖాళీలను రెగ్యులర్, మొదటి ఏ ఎన్ ఎం లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం మ్యాపింగ్ చేయాలనీ ఇప్పటికీ అదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా మైదాన ప్రాంతాల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న తమను రేషనలైజేషన్ పేరిట గిరిజనప్రాంతాలలోని సచివాలయాలకు పంపించడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని, దీనినితీవ్రంగా ఖండిస్తున్నామని వారంతా ఆందోళనకు సిద్ధపడుతున్నారు. పనిచేయడానికి మేము ఎప్పుడు వ్యతిరేకంకాదని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రెగ్యులర్ ఏఎన్ఎంలకు తగున్యాయం చేయాలని వారు కోరుతున్నారు.ఏఎన్ఏం లను సచివాలయాలుకు మ్యాపింగ్ చేసే బాధ్యతలు సంబంధిత వైద్య అధికారులకు ఇవ్వడం జరిగిందని, చాలామంది వైధ్యాదికారులు ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా మ్యాపింగ్ చేయడం జరిగిందని, కాబట్టి తక్షణమే ఇటువంటి మ్యాపింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరుతున్నారు. రెగ్యులర్ ఏఎన్ఎంలకు అందరితోపాటు సమానంగా జీరో పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని అందరికీ సమానంగా రూల్స్ వర్తించే విధంగా కౌన్సిలింగ్ జరపాలని పార్వతీపురం మన్యంజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి వి ఆర్ ఎస్ కిషోర్, కార్యదర్శి పి పద్మ, జి సత్యనారాయణ, జి సూర్యనారాయణలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో కరోనానుండి ప్రజలను కాపాడి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏఎన్ఎంల సేవలే ప్రధానకారణమని దీన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.రెగ్యులర్ గా ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాల్లోనే వారిని నియమించి అందరికీ తగు న్యాయం చేయాలని కోరారు. నియమాలకు వ్యతిరేకంగా మ్యాపింగ్ చేసి బదిలీచేస్తే సంఘటితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారుతెలిపారు. దీనిపై వైద్య అరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img