విశాలాంధ్ర,సీతానగరం: ఆర్ అండ్ బి అధికారుల తీరుకు నిరసనతో పాటు సీతానగరం మార్కెట్ కూడలిలో రోడ్డు మరమ్మత్తులు చేయకపోతే 48గంటల్లో మోకాల్లపై నిలబడి నిరసన కార్యక్రమాన్ని చేస్తానని జిల్లా కలక్టర్ కు సోమవారం ఎమ్మెల్యే జోగారావు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మంగళవారం ఆర్ అండ్ బి ఎఈ రామ్మోహనరావు ఆరుయూనిట్ల వెట్ మిక్స్ ను పెద్దలారీతో తెప్పించి,జెసిబి ద్వారా ఒక గుత్తేదారు సమక్షంలో స్థానిక నాయకుల సూచనల మేరకు ప్రదానగోతిని కప్పిపెట్టారు. దీనిపై ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ సీతానగరం మండల కేంద్రంలోని రోడ్డును వేయడానికి కట్టుబడి ఉన్నానని, దీనికోసం 40లక్షల రూపాయల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ అండ్ బి అధికారుల ద్వారానే ఇప్పటికే పంపామని చెప్పారు. ఒకటి రెండురోజుల్లో అనుమతులు రాగానే శాశ్వత పనులు చేస్తామని చెప్పారు. తానుఇచ్చిన మాట ప్రకారం బిటి రోడ్డును 700మీటర్ల పరిదిలో వేస్తామని, దీనికి సంబంధించి మంజూరు ఉత్తర్వులు తెచ్చేందుకు ప్రత్యేకదృష్టి సారించినట్లు ఆయన అన్నారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమంకోసం తాను ఎల్లప్పుడూ ఆలోచనచేస్తున్నానని చెప్పారు. నియోజక వర్గంలోని ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొనడమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు.