ఎంపికి, రైల్వే అధికారులకు, విశాలాంధ్రకు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు
విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని సీతానగరం రైల్వే స్టేషన్ నుండి ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డువరకు గల రహదారిని రైల్వేగుత్తేదారు మరమ్మతులు చేసి ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు.ఈరోడ్డు దుస్తితిగూర్చి విశాలాంధ్ర దినపత్రిక సోమవారం ఁసీతానగరం రైల్వే స్టేషన్ రోడ్డును బాగు చేయండిఁ అనే వార్తను ప్రచురించడంతోపాటు నేరుగా ఎంపి మాధవికి, రైల్వే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది.దీనికి స్పందించిన అరకు ఎంపి గొడ్డెటి మాధవి కూడా రైల్వే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారు.దాంతోపాటు రైల్వే ఏఈఈ (రాయగడ)సంజీవ్ దీక్షిత్, బొబ్బిలి ఐఒడ బ్ల్యు అధికారి గిరిధర్ లతో పాటు రైల్వే స్టేషన్ మేనేజర్ చరణ్ కుమార్లు స్పందించి హుటాహుటీన గుత్తేదారుతో మాట్లాడి పూర్తిగా గుమ్ములు, గోతులతో కూడిన రోడ్డును మరమ్మతులు చేసి కొత్త రోడ్డును నిర్మాణం చేశారు.రాత్రిపూట ట్రైన్ దిగేప్రయాణికులు ,నడిచే వెళ్ళేవారు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి ఇబ్బందులను గుర్తించి విశాలాంధ్ర ప్రచురించగా స్పందించి రోడ్డునిర్మాణం చేయడంతో సీతానగరంమండల ప్రయాణికులు, ప్రజలు అరకు ఎంపిమాధవికి, రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.సమస్య తెలియజేసిన వెంటనే స్పందించి పరిష్కారం చేయడంపట్ల వారంతా హర్షం వ్యక్తంచేశారు.