విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం ఆర్టీసీ బోర్డు సభ్యులు రాజారెడ్డి సందర్శించారు. ముందుగా కార్గో సెంటర్ ను సందర్శించి వినియోగదారులకు కార్గో యొక్క సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్గో సేవలను రాష్ట్రవ్యాప్తంగా పెంచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రానున్న కాలంలో 1000 ఎలక్ట్రికల్ బస్సులను అద్దెకు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీఎస్ఆర్టీసీకి ఎన్నో రకాల ఆర్థిక వనరులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకునేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ముఖ్యంగా కార్గో యొక్క సేవలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికులపై గౌరవభావం చూపాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ , జోన్ కమర్షియల్ అధికారి అప్పలనాయుడు, పార్వతీపురం ప్రజా రవాణా అధికారి సుధాకర్, విజయనగరం కమర్షియల్ ఏటీఎం హెచ్ దివ్య తదితర ప్రజా రవాణా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు