Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సచివాలయ ఉద్యోగుల వేతనాలను బయోమెట్రిక్ తో లింకు చేయవద్దు

జారీచేసిన మెమోను వెనక్కి తీసుకోవాలి: ఎన్జీఓ సంఘం మన్యంజిల్లా అధ్యక్షుడు కిషోర్
విశాలాంధ్ర, పార్వతీపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మానస పుత్రికలుగా/పుత్రులుగా చెప్పుకుంటున్న వార్డు సచివాలయం/గ్రామ సచివాలయం ఉద్యోగుల వేతనాలను బయోమెట్రిక్ తో లింకుచేసి ఇవ్వరాదని ఏపీ ఎన్జీవో సంఘం మన్యంజిల్లా అద్యక్షుడు జి వి ఆర్ యస్ కిషోర్ డిమాండ్ చేశారు.శనివారం అయన విలేకరులతో మాట్లాడుతో వార్డు సచివాలయం/గ్రామ సచివాలయం ఉద్యోగుల వేతనాలను మార్చి 1నుండి 31వరకు బయోమెట్రిక్ విధానంతో సరిపోల్చి చెల్లించాలని ఆదేశిస్తూ మెమో 114/ఎఫ్/2022తేదీ:23/03/2023జారీ చేసారని, తక్షణమే ఈ మెమోను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఏపీ ఎన్జీవో సంఘం తరుపున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఉన్నత చదువులు చదివి, పెద్దపెద్ద కంపెనీలోను, సాప్ట్ వేర్ లోను వేలాది రూపాయల వేతనాలను తీసుకొని ఉద్యోగాలు చేసుకునే వారంతా ప్రభుత్వ ఉద్యోగమని చెప్పి వార్డు/ గ్రామసచివాలయం ఉద్యోగాల్లో చేరారని, నేడు వారంతా తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నారన్నారు. వారిపై నిరంతర వత్తిడి వలన మానసికంగా ఎంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన చాలా నియమాలు, రూల్స్ వీరికి వర్తించని సందర్భాలు ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో రెగ్యులర్ చెయ్యాల్సిన చాలా మంది వార్డు/గ్రామ సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ఇంతవరకు రెగ్యులర్ చేయక పోవడంతో వారంతా ఎన్నో రాయితీలు కోల్పోతున్నారని తెలిపారు. ఎంతో మంది వార్డు/సచివాలయం ఉద్యోగులు పనిబారాన్ని, వత్తిడిని తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. తక్షణమే రెండో ఫేస్ లో రిక్రూట్ చేసిన వార్డు/ గ్రామ సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, బయోమెట్రిక్ తో లింకుచేస్తూ జారీచేసిన మెమోను తక్షణమే ఉపసంహరణ చేయాలని, వీరిపై పనిబారాన్ని తగ్గించాలని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల రూల్స్ వీరికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img