విశాలాంధ్ర,సీతానగరం: సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని, సక్రమంగా పనిచేస్తూ గ్రామంలో పారిశుధ్యంను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈఓపిఆర్డీ కెకెకెవర్మ పిలుపునిచ్చారు.గురువారం మండలంలోని గెడ్డలుప్పి, బగ్గందొరవలస గ్రామ సచివాలయంలను ఆయన సందర్శించారు. గ్రామాల్లోని పారిశుధ్య సమస్యను గుర్తించి త్వరగా పరిష్కరించాలని కోరారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ద తీసుకోవాలని కోరారు.సచివాలయం సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల వివరాలను సకాలంలో అప్ లోడ్ చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో సర్పంచులు తిరుపతిరావు, నారాయణ రావు, సెక్రెటరీలు మోహన్, శ్రీనివాసరావు,సిబ్బంది పాల్గొన్నారు.