Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

రామమందిరానికి టైల్స్ విరాళంగా అందించిన పానీపూరి శివ

విశాలాంధ్ర, పార్వతీపురం: మండలంలోని నరిసిపురం దగ్గర వెంకటరాయుడుపేట గ్రామంలో నిర్మిస్తున్న రామమందిరానికి సీతానగరం మండలంలోని చెల్లంనాయుడువలస గ్రామానికి చెందిన పానీపూరిశివ(తెంటు శివ)దంపతులు 40వేల రూపాయల విలువచేసే టైల్స్ ను ఎమ్మెల్యే జోగారావు, పార్వతీపురం, బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇంచార్జిలు బొబ్బిలి చిరంజీవులు, బేబీనాయనల చేతుల మీదుగా గ్రామస్తులకు అందజేసారు.తనతోపాటు దాసరి అప్పలనాయుడు, తెంటు సింహాచలం-లక్ష్మి, టి శివ,టి వెంకటరమణ, కె అప్పలఅప్పలసమ్మ, కె అప్పలనాయుడు,అనిల్ అనిల్ ,సందెమ్మ,మరడాన రామకృష్ణ దంపతులు నగేష్ దంపతులు ,గోపాల్ దంపతుల సహాయం అందించడం జరిగిందని తెలిపారు. తమగ్రామ రామ మందిరానికి టైల్స్ అందించిన శివ, అతని బందువులయిన చెల్లం నాయుడువలస గ్రామస్తులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img