Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం

మంత్రి బొత్స

విశాలాంధ్ర – విజయనగరం : చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడు నెలల్లో సి.పి.ఎస్. ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని మంత్రి బొత్స.ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఏ.పి. గవర్నమెంట్ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.పి.ఎస్. కంటే మెరుగైన పరిష్కారం చూపాలని, ఉద్యోగులకు ప్రయోజన కరంగా వుండే మంచి నిర్ణయం తీసుకోవాలని సి.ఎం. స్పష్టంగా చెప్పారని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి కొత్త పి.ఆర్.సి. ప్రకారం జీతాలు చెల్లిస్తామని తెలిపారు.
విద్యా శాఖలో బోధన చేసే టీచర్ నుంచి ప్రొఫెసర్ వరకు అన్ని స్థాయిల్లో వారికి వచ్చే మూడు నెలల్లో ప్రమోషన్ లు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు వున్నారని, వారిలో అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేసే అంశంపై త్వరలో నిర్ణయంతీసుకుంటామని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖలోనూ వచ్చే మూడు నెలల్లో ప్రమోషన్ లు ఇవ్వడం జరుగుతుందని, ప్రమోషన్ ల విషయంలో ఆయా శాఖల ఉద్యోగులు కోర్టు లకు వెళ్లి అడ్డుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు చొరవ చూపి మాట్లాడాలని కోరారు.
ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని, వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేననిమంత్రి బొత్స అన్నారు.
సమావేశంలో సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img