విశాలాంధ్ర,పార్వతీపురం : స్పందన కార్యక్రమం ద్వారా విచ్చేసిన వినతులు త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.80దరఖాస్తులు వచ్చాయనీ, వాటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి నియమ నిబంధనల మేరకు పరిష్కారం చేయాలని కోరారు.
ఈకార్యక్రమంలో డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా వ్యవసాయ జాయింట్ డెరైక్టర్ రాబర్ట్ పాల్, జిల్లా వెద్య ఆరోగ్య అధికారి బి.జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజీ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టిబాబు, జి సి సి డివిజనల్ మేనేజర్ వీరేంద్ర కుమార్,పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా పశు సంవర్డక అధికారి ఈశ్వరరావు, జిల్లావిద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు తదితరులు పాల్గొన్నారు.